: హ్యూస్ మృతి నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు వాయిదా
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిల్ హ్యస్ మృతి చెందిన నేపథ్యంలో... భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన తొలి టెస్టు వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు ప్రకటన చేశాయి. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ బ్రిస్బేన్ లో డిసెంబర్ 4 నుంచి 8 వరకు జరగాల్సి ఉంది. ఈ టెస్టు ఎప్పుడు నిర్వహించేది తెలియాల్సి ఉంది.