: సచిన్ ఆత్మ శాంతించాలని ప్రచురించారు!
ఓ ఆంగ్ల దినపత్రికలో పొరబాటు దొర్లింది. విషయం ఏమిటంటే... ఆసీస్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతికి సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో సంతాప ప్రకటన చేశాడు. ఆ సందేశం కాస్తా పత్రికలో తప్పుగా ప్రచురితమైంది. హ్యూస్ ఆత్మకు శాంతి కలగాలని సచిన్ ట్వీట్ చేస్తే, 'సచిన్ ఆత్మకు శాంతి కలగాలని పత్రిక వారు ప్రచురించారు. దీంతో, మాస్టర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. 'ఆ పత్రిక ఆత్మకు శాంతి కలుగుగాక' అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.