: కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి సుజనాచౌదరి సమీక్ష
కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఈరోజు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు, రాజధాని నిర్మాణానికి వనరుల సమీకరణ పైనా చర్చించారు.