: నాపై ఆరోపణలు రుజువైతే అగ్ని ప్రవేశం చేస్తా: లక్ష్మీపార్వతి
దివంగత ఎన్టీఆర్ మరణానికి సంబంధించి టీడీపీ నేతలు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న అన్యాయమైన ఆరోపణలను తప్పని నిరూపించేందుకే ఎన్టీఆర్ మరణంపై విచారణ చేపట్టాలని కోరుతూ టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశానని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన మరణానికి చంద్రబాబు కారకుడయ్యాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా గతంలో వ్యాఖ్యానించారని చెప్పారు. తనపై వస్తున్నవన్నీ అసత్య ఆరోపణలని... తన వద్ద డాక్టర్ నివేదిక కూడా ఉందని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానని... తానెన్నడూ పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు రుజువైతే బహిరంగంగా అగ్ని ప్రవేశం చేస్తానని అన్నారు.