: ఈ రోజే లేకపోతే మనమంతా ఇక్కడుండే వాళ్లం కాదు: రసమయి బాలకిషన్
ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం దీక్ష చేసిన రోజని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఉద్యమించారని కొనియాడారు. ఈ రోజే లేకపోతే మనమంతా ఇక్కడ ఉండేవాళ్లం కాదని శాసనసభలో మాట్లాడుతూ రసమయి అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ ముందు నడుస్తూ ప్రజలను భాగస్వాములను చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ ఏ ఒక్క టీడీపీ నేత కూడా పాల్గొనలేదని ఆయన ఆరోపించారు.