: అనంత విద్యుత్ ఘాతం ఘటన కుటుంబానికి మంత్రి సునీత పరామర్శ
అనంతపురం జిల్లా విడపనకల్ మండల పరిధిలోని చీకలగుర్కి గ్రామంలో విద్యుత్ ఘాతంతో మరణించిన వారి కుటుంబాన్ని మంత్రి పరిటాల సునీత ఈరోజు పరామర్శించారు. చనిపోయిన వారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. ప్రభుత్వం తరపున తప్పకుండా ఆర్థిక సాయం అందిస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. అటు టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున మిగతా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని చెప్పారు. నిన్న (శుక్రవారం) పొలంలో పని చేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో అక్కడిక్కడే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.