: అఫ్జల్ ఉరి ఆలస్యంపై సీపీఐ విమర్శలు
పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురుకు కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు నాన్చిందని సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ అమలు చేసిన ఉరిశిక్ష వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ క్షమాభిక్షలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సురవరం మండిపడ్డారు.