: నేడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు బయలుదేరుతున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఈశాన్య రాష్ట్రాలకు బయలుదేరుతున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన అసోంలోని గౌహతిలో జరగనున్న రాష్ట్ర డీజీపీల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం అసోం నుంచి మేఘాలయకు కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే లైనును ప్రారంభిస్తారు. అలాగే భైరబీ నుంచి మిజోరంలోని సాల్ రంగ్ వరకు నిర్మించనున్న రైల్వే లైన్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలను కలుసుకోవడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నానని మోదీ ట్వీట్ చేశారు.