: ఉత్తరాఖండ్ సీఎం కాన్వాయ్ పై బీజేపీ రాళ్ల వర్షం


అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. నైనిటాల్ జిల్లాలోని హల్దవానీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో బాధిత కుటుంబాన్ని రావత్ పరామర్శించి, దోషులను కఠినంగా శిక్షిస్తామని, దైర్యం చెప్పి తిరిగొస్తుండగా ఆయన కాన్వాయ్ పై కొందరు బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఆ రాళ్లు సీఎం ప్రయాణిస్తున్న కారు వెనుక అద్దానికి తగిలాయి. సీఎం కారు ముందు సీట్లో కూర్చోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని ఏడీజీ రాంసింగ్ మీనా తెలిపారు. రాళ్లు రువ్విన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News