: దేశ రాజధానిలో ఏఎస్సై అసభ్య ప్రవర్తన... కేసు నమోదు


పోలీసుల తీరుతెన్నులు తెలిపే సంఘటన ఢిల్లీలోని గుర్ గావ్ లో చోటుచేసుకుంది. తమ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వారితో సమస్య రావడంతో మరికొందరితో కలిసి మీనూసింగ్ అనే మహిళ సెక్టార్-5 పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో నరేంద్ర కుమార్ అనే ఏఎస్ఐ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కేసును పరిష్కరించేందుకు తనకు ఏమివ్వగలరని ఆయన అడిగారు. 'మీ పని మీరు చేయండి' అని ఆమె సూచించడంతో ఏఎస్ఐ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సమయంలో ఆమెతోపాటు వచ్చిన వారంతా ఉన్నారు. దీంతో ఆమె ఏఎస్ఐ నరేంద్రకుమార్ తమను అవమానించి, అసభ్యంగా ప్రవర్తించారని పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కమిషనర్, ఏఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. జరిగిన ఉదంతానికి ప్రత్యక్ష సాక్షులు పెద్ద సంఖ్యలో ఉండటంతో కేసు పెట్టినట్లు ఏసీపీ రాజేష్ కుమార్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News