: విడాకుల కేసులో 3,290 కోట్ల భరణం
బ్రిటన్ లో ఓ భార్య నుంచి విడాకులు కోరిన భర్తను భారీ భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. భార్యతో విడాకులు పొందేందుకు ఆమెకు 530 మిలియన్ల డాలర్లు అంటే 3,290 కోట్ల రూపాయలు చెల్లించాలని బ్రిటన్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అమెరికా సంతతికి చెందిన జామీ కూపర్ హోన్ (49), హెడ్జ్ ఫండ్ మేనేజర్ క్రిస్ హోన్(48) భార్యాభర్తలు. 15 ఏళ్లు కాపురం చేసిన అనంతరం వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆస్తి విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లు. ఆస్తిలో పావువాటా ఇచ్చేందుకు ఆమె భర్త అంగీకరిచాడు. అయితే ఆస్తి ఇద్దరి మూలంగా పెరిగిందని, తనకు పావువంతు భిక్షం వేయడం ఏంటని ఆమె అతనితో వాదించింది. దీంతో వారిద్దరూ బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భార్యకు 2006 నుంచి 2011 వరకు ఒక బిలియన్ డాలర్లు అంటే 100 కోట్ల రూపాయలు చెల్లించానని ఆయన న్యాయస్థానానికి విన్నవించాడు. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం 530 మిలియన్ డాలర్లు భరణంగా భార్యకు చెల్లించాలని ఆదేశించింది. భరణంగా ఇప్పటి వరకు జరిగిన చెల్లింపుల్లో ఇదే అత్యంత ఖరీదైన భరణం అని న్యాయనిపుణులు పేర్కొన్నారు.