: ప్రజలను చీపుర్లు పట్టుకొమ్మని చెప్పం...ఉపాధి కల్పిస్తాం: రాహుల్


కాంగ్రెస్ పార్టీ ప్రజలను చీపుర్లు పట్టుకొమ్మని చెప్పదని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఝార్ఖండ్ లోని ఛాయ్ బాసాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. యూపీఏ తీసుకొచ్చిన పలు చట్టాలను ఎన్డీయే తీసేయాలని చూస్తోందని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ కేవలం కార్పొరేట్ వర్గాలను తృప్తిపరిచేందుకు మాత్రమే పని చేస్తోందని, పేదలను మర్చిపోయిందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News