: అందుకోసం జపాన్ వెళ్లాలా?...బాపట్ల వస్తే సరిపోయేది!: బాబుకు ఉమ్మారెడ్డి చురక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో రైతులు శాశ్వత రుణగ్రహీతలుగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయం అధ్యయనం చేసేందుకు సీఎం జపాన్ కే వెళ్లాలా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలకు వస్తే అవసరమైన సమాచారం అందుబాటులో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, భిక్షమెత్తుతున్న డబ్బుతో బాబు విహారయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీల నుంచి తప్పించుకునేందుకు విదేశాల్లో గడిపేస్తున్నారని ఆమె విమర్శించారు.