: హోండా టూరింగ్ బైక్ కేవలం 31.5 లక్షలే!


బైక్ లపై యాత్రలు చేయాలనుకునే ఔత్సాహికుల కోసం హోండా మోటారు సైకిళ్ల కంపెనీ రెండు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) గోల్డ్ వింగ్ ఆడియో కంఫర్ట్, గోల్డ్ వింగ్ ఎయిర్ బ్యాగ్ అనే రెండు మోడళ్లు టూరింగ్ కల్చర్ పెంచేందుకు తోడ్పడుతాయని కంపెనీ అభిప్రాయపడింది. ఆరు సిలిండర్లు, 1,832 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లభ్యమవుతున్న ఈ బైక్ లో వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వివరించింది. సీట్లను సౌకర్యానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చని, కాళ్లను వేడెక్కించే సిస్టమ్ ఉందని, స్పీకర్ల సరౌండ్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ లాకింగ్ సిస్టమ్, చిన్న సందుల్లో సులువుగా రివర్స్ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్ కూడా ఈ బైక్ లో పొందుపరిచామని కంపెనీ వెల్లడించింది. 1975లో ప్రపంచ వ్యాప్తంగా తొలిసారి విడుదలైన ఈ బైక్ అత్యాధునిక హంగులతో యాత్రికుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించామని హోండా చెప్పింది. గోల్డ్ వింగ్ కంఫర్ట్ ధర 28.5 లక్షల రూపాయలుగా పేర్కొన్న కంపెనీ, గోల్డ్ వింగ్ ఎయిర్ బ్యాగ్ ధర 31.5 లక్షల రూపాయలని స్పష్టం చేసింది. ఎంపిక చేసిన షోరూముల్లో ఈ బైక్ దొరుకుతుందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో కీత్ మురముత్సు తెలిపారు.

  • Loading...

More Telugu News