: నాలుగు జిల్లాల్లో 'హుదూద్' నష్టం 21,908 కోట్లు: ప్రత్తిపాటి పుల్లారావు


'హుదూద్' తుపాను నష్టంపై కేంద్ర బృందానికి నివేదిక అందజేసినట్టు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 'హుదూద్' తుపాను కారణంగా 21,908 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనావేసి నివేదిక అందజేశామని అన్నారు. ఇప్పటి వరకు 750 కోట్ల రూపాయలను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అన్ని వివరాలతో కూడిన తుది నివేదికను కేంద్రానికి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News