: రాళ్లు రువ్వి, వాహనం ధ్వంసం చేసి కలకలం రేపిన ఉన్మాది
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్మాది కలకలం రేపాడు. జనంపైకి రాళ్లు రువ్వి భయభ్రాంతులను చేశాడు. కానిస్టేబుల్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. మనిషిని చూస్తే రెచ్చిపోతున్న ఈ ఉన్మాదిని స్థానికులు చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.