: ఫేస్ బుక్ లో తనను అమ్మకానికి పెట్టుకున్న వడోదర మహిళ


దారిద్ర్యం... కొందరిలో పట్టుదలను పెంచి ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తే, మరికొందరిని పక్కదారులు పట్టించి పతనం దిశగా తీసుకెళుతుంది! ఇంకొందరిని అసమర్థులుగా మార్చి పీల్చి పిప్పి చేస్తుంది! తాజాగా, గుజరాత్ లో ఓ మహిళ బాధలు భరించలేక తనను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టుకుంది. వడోదరకు చెందిన చాందిని రాజ్ గౌర్ ఫేస్ బుక్ లో తన ఫొటో పోస్టు చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు చికిత్స చేయించేందుకు డబ్బు నిమిత్తం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది. తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే చూసుకుంటోంది. 20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వడోదర చేరుకుంది చాందిని కుటుంబం. జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ఇక్కట్లు తీరాలంటే తాను అమ్ముడవడం తప్ప మరోమార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News