: ప్రతి ఇంటికీ నీరివ్వలేకపోతే ఓట్లడగను: కేసీఆర్
నాలుగేళ్లు పూర్తయ్యే సరికి తెలంగాణలోని డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ తో ప్రతి ఇంటికీ నీరు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ ద్వారా నీరు అందించలేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లడగబోమని అన్నారు. వాటర్ గ్రిడ్ కు అవసరమైన నిధుల కోసం ప్రధానిని కలవనున్నామని ఆయన వెల్లడించారు. చిత్తశుద్ధితో కష్టపడుతున్నామని చెప్పిన ఆయన, 'మిషన్ కాకతీయ' పేరిట చెరువుల పునరుద్ధరణ చేపడతామని తెలిపారు.