: కాశ్మీరీ పండిట్లు, పాక్ శరణార్థులకు బీజేపీ హామీలు


జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాశ్మీరీ పండిట్లు, పాక్ శరణార్థులను బీజేపీ తమ వైపుకు తిప్పుకునేందుకు శ్రమిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన 'విజన్ డాక్యుమెంట్'లో వారిద్దరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తామని పలు హామీలు ఇచ్చింది. కాశ్మీర్ లోయలోని మూడు అసెంబ్లీ సీట్లను రిజర్వేషన్ కింద కాశ్మీరీ పండిట్స్ కు తప్పకుండా ఇస్తామని తెలిపింది. ఇక పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ నుంచి వచ్చి నివాసముంటున్న వారికి ఓటు హక్కు కల్పిస్తామని, తల్లి ఇతర రాష్ట్రాల్లోని వారిని వివాహం చేసుకున్నా, వారి పిల్లలకు ఆస్తి హక్కు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే, ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370పై మాత్రం బీజేపీ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News