: మహిళా కార్పొరేటర్ పై యాసిడ్ దాడి... పరిస్థితి విషమం


డబ్బు విషయంలో వచ్చిన తగాదా ఓ మహిళా కార్పొరేటర్ పై యాసిడ్ దాడి జరిగేందుకు కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లా ఫరీద్ పూర్ లోని ఫరా ప్రాంత కార్పొరేటర్ ముస్కాన్ దేవి (35) తన భర్తతో కలసి వారి ఇంటి వద్దనే ఓ దుకాణం నడుపుతున్నారు. రామ్ దాస్, అరవింద్ అనే వ్యక్తులతో వీరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అయితే, డబ్బు విషయమై వాగ్వివాదం జరిగిన అనంతరం ముస్కాన్ పై వీరు యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News