: జపాన్ ప్రధానికి శ్రీవారి శాలువా కప్పిన చంద్రబాబు... ఈ శాలువాతోనే ఎన్నికలకు వెళ్తానన్న ప్రధాని
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. జనవరిలో భారత్ పర్యటన సందర్భంగా ఏపీకి విచ్చేయాలని ఈ సందర్భంగా షింజో అబేకు చంద్రబాబు ఆహ్వానం పలికారు. అంతేకాకుండా జపాన్ ప్రధానికి చంద్రబాబు తిరుమల శ్రీవారి శాలువా కప్పి, ప్రసాదాన్ని ఇచ్చారు. దీంతో, ఎంతో సంతోషానికి లోనైన షింజో అబే... ఈ శాలువాతోనే రానున్న ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. ఏపీ అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.