: బౌలర్ అబాట్ ను కలిసిన హ్యూస్ సోదరి మేగన్
యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానికి కారణమైన బౌన్సర్ ను విసిరిన షాన్ అబాట్ ఇప్పుడు జీవితకాల వేదనతో సతమతమవుతున్నాడు. తన తప్పేమీ లేకపోయినా, అపరాధ భావన అతడిని పట్టి పీడిస్తుందనడంలో సందేహంలేదు. అయితే, యావత్ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు అబాట్ ను ఊరడిస్తోంది. తను తప్పేమీ చేయలేదంటూ ఈ యువ బౌలర్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు క్రికెటర్లందరూ. క్రికెటర్లే కాదు, హ్యూస్ సోదరి మేగాన్ కూడా అబాట్ ను ఓదార్చిందట. గురువారం నాడు హ్యూస్ మరణవార్త విన్న వెంటనే సిడ్నీ ఆసుపత్రికి వెళ్లిన అబాట్ ను అక్కడే ఉన్న మేగాన్ కలిసింది. అతడితో సుదీర్ఘంగా మాట్లాడి, బాధపడవద్దని చెప్పిందట.