: రూ.1 లక్ష ఇవ్వండి... స్వర్గలోక టికెట్ పొందండి: బాబా రాంపాల్ నయా మోసం
హర్యానా బాబా రాంపాల్ అమాయక ప్రజలను మోసగించిన తీరు కథలు కథలుగా బయటకొస్తోంది. స్వర్గానికి టికెట్లిస్తానని చెప్పిన రాంపాల్, అందుకు రూ.1 లక్ష ఇస్తే చాలని భక్తుల నెత్తిన టోపీ పెట్టారట. ఇలా ఆయన మాయలో పడి స్వర్గలోక టికెట్లను పొందిన వారు చాలా మందే ఉన్నారట. గురువారం దాకా తమ కస్టడీలో ఉన్న బాబా రాంపాల్, తన నయా దందాను స్వయంగా వెల్లడించారని హిసార్ ఎస్పీ సత్యేంద్ర కుమార్ గుప్తా చెప్పారు. తన దందాను నిర్విఘ్నంగా సాగించేందుకు రాంపాల్ చిట్ ఫండ్ స్కీముల తరహాలో ఓ భారీ పథకాన్ని పకడ్బందీగా నడిపారని గుప్తా తెలిపారు. చిట్ ఫండ్ కంపెనీలు తమ ఏజెంట్లకు కనీసం కమీషనైనా ఇస్తాయేమో కాని, రాంపాల్ మాత్రం తన పథకాన్ని ప్రచారం చేసిన ఏజెంట్లకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. తన భక్తులుగా మారే వారు ఒక్కొక్కరు ముగ్గురు వ్యక్తులను కాని, ఓ కుటుంబాన్ని కాని తన వద్దకు తీసుకురావాలని ఆయన టార్గెట్ లు నిర్దేశించే వారట. ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానం చేరిన రాంపాల్, తాను విక్రయించిన స్వర్గలోకపు టికెట్ల చెల్లుబాటుపై ఏం చెబుతారో చూడాలి.