: ఇంకా బంకర్ లో దాగున్న తీవ్రవాదులు... కొనసాగుతున్న కాల్పులు


పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి ఇండియాలోకి చొరబడి పాడుబడ్డ బంకర్ ను ఆక్రమించుకున్న తీవ్రవాదులతో సైన్యం ఇంకా తలబడుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి జరుగుతున్న కాల్పుల్లో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు ఉండగా మిగతావారు తీవ్రవాదులని పోలీసులు తెలిపారు. బంకర్ లో ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులు దాగి ఉండవచ్చని భావిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. వీరంతా ఆర్మీ దుస్తుల్లో వచ్చారని వివరించారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార నిమిత్తం ఆ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఈ ఘటన జరగటంతో ప్రధాని సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News