: ఆస్తి పంచలేదని కన్న తల్లిపై దాడి
ఎంతగా అడుగుతున్నా ఆస్తి పంచడం లేదని కన్న తల్లిపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడో పుత్రరత్నం. కని పెంచిందన్న కనికరం కూడా లేకుండా కొడుకు చేసిన దాడిలో ఆ తల్లి తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి కూడా మనసు మారక అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో చోటు చేసుకుంది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.