: హైదరాబాదులో ఏడు కిలోల బంగారం పట్టివేత


హైదరాబాదులో ఈరోజు ఏడు కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆబిడ్స్ లోని రాజ్ మాతా హోటల్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ మకాం వేసిన ఇద్దరు ముంబై వాసుల వద్ద ఏడు కిలోలకు పైగా బంగారాన్ని కనుగొన్నారు. భారీ ఎత్తున బంగారంతో లాడ్జీలో దిగిన ముంబై వాసులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో బంగారంతో వారు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News