: వ్యాపార దిగ్గజాల జాబితాలో ఒకే ఒక్కడు!


2014 సంవత్సరానికిగాను ఫార్చ్యూన్ పత్రిక ప్రకటించిన వ్యాపార దిగ్గజాల జాబితాలో ఒకే ఒక్క భారతీయుడికి చోటు లభించింది. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ సింగ్ బంగా ఈ జాబితాలో 28వ స్థానంలో నిలిచారు. గూగుల్ సీఈఓ లారీ పేజ్ తొలి స్థానంలో, ఆపిల్ సీఈఓ టింకుక్ రెండవ స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ళ 38వ ర్యాంకులో నిలిచారు. కాగా, అజయ్ సింగ్ 13 సంవత్సరాలపాటు నెస్లే ఇండియాలో పనిచేసి ఆపై పెప్సీకో, సిటీ గ్రూప్ తదితర కంపెనీలలో వివిధ హోదాలలో పనిచేశారు.

  • Loading...

More Telugu News