: టీడీపీ ఖాతాలో కర్నూలు డీసీసీబీ ఛైర్మన్ పీఠం
కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో చేరింది. గతంలో జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి శ్రీదేవి డీసీసీబీ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. అయితే జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీల బలాబలాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో డీసీసీబీ ఛైర్మన్ పదవిని పొందే అర్హత వైకాపా కోల్పోయింది. ఆ పార్టీకి మెజారిటీ తగ్గిన నేపథ్యంలో శ్రీదేవిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో శ్రీదేవి ఓటమిపాలయ్యారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మెజారిటీ సభ్యులు ఓటేశారు. దీంతో ఆమె ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో డీసీసీబీకి కొత్త ఛైర్మన్ ను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలో అనూహ్యంగా బలం పెంచుకున్న టీడీపీకే డీసీసీీబీ ఛైర్మన్ పదవి దక్కనుంది.