: మంత్రులను అసెంబ్లీకి వెళ్ళనివ్వం


ఈ ఉదయం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులను ఓసీటీఎల్ కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు మంత్రులను అసెంబ్లీకి వెళ్ళనివ్వబోమని వారు తెగేసి చెప్పారు. కుటుంబ సభ్యులతో కలసి కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే మంత్రుల నివాసాల ముందుకు ఒకేసారి అంత మంది కార్మికులు రావటం, దాన్ని ముందుగా పసిగట్టలేక పోవటం ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే అంటున్నారు కొందరు.

  • Loading...

More Telugu News