: తిరుపతి దగ్గర 79 మంది స్మగ్లర్ల అరెస్ట్


శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనం చెట్లను నరికి వాటిని తరలించేందుకు వస్తున్న భారీ ముఠాను శ్రీకాళహస్తి సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు అరెస్ట్ చేసారు. నేటి ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ టిప్పర్ లో వస్తున్న 79 మంది కనిపించారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామంతా ఎర్రచందనం కోసం వచ్చామని తెలిపారు. తొలుత వాహన డ్రైవర్ ను ప్రశ్నించగా, అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడని పోలీసులు చెప్పారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News