: 'ఐసీయూ'లో ఫుట్ బాల్ దిగ్గజం పీలే
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం పీలే బ్రెజిల్ లోని సావోపాలోలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న పీలే మూడు రోజల క్రితం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం పీలే ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.