: రోజ్ వ్యాలీ ఖాతాల్లోని రూ. 295 కోట్లు సీజ్!


భువనేశ్వర్ కేంద్రంగా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో చిట్ ఫండ్ కార్యకలాపాలు సాగిస్తున్న రోజ్ వ్యాలీ కంపెనీకి చెందిన రూ. 295 కోట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురువారం సీజ్ చేసింది. తద్వారా దేశంలోనే అతిపెద్ద నగదు స్వాధీనంగా నమోదైన రూ.138 కోట్ల సహారా నగదు స్వాధీనం రికార్డు బద్దలైపోయింది. అమాయక ప్రజల నుంచి డిపాజిట్ల పేరిట సేకరించిన రూ. 295 కోట్లను దారిమళ్లించేందుకు రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీ 27 అనుబంధ కంపెనీలను తెరచింది. వీటిలోని ఆరు కంపెనీలకు చెందిన 2,807 బ్యాంకు ఖాతాల్లోనే ఈడీ అటాచ్ చేసిన నగదు ఉండటం గమనార్హం. అతి తక్కువ కాలంలోనే అత్యధిక రాబడులు అందిస్తామని ప్రకటనలు గుప్పించి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన రోజ్ వ్యాలీ, ఇప్పటిదాకా మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సంబంధించి డిపాజిటర్లకు రూ.362 కోట్ల మేర బకాయి పడింది. ఈ సంస్థ పలు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సెబీ పలు కోణాల్లో విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గురువారం ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని భారీ నగదును ఈడీ సీజ్ చేసింది.

  • Loading...

More Telugu News