: చాలా మంది అమ్మాయిల కోసం కష్టపడ్డా... జేబులు ఖాళీ అయ్యాయి: నాగార్జున
తాను చాలా మంది అమ్మాయిల కోసం కష్టపడ్డానని ప్రముఖ హీరో నాగార్జున తెలిపారు. 'చిన్నదాన నీకోసం' సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా హోస్ట్ లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అమ్మాయిల కోసం కష్టపడడంలోనే ఆనందం ఉందని అన్నారు. అమ్మాయిల కోసం కష్టపడడంలో ఇష్టం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా నితిన్ ను ఎంత మంది అమ్మాయిల వెంటపడ్డావని అడిగారు. తాను ఒకేఒక్క అమ్మాయి వెంటపడ్డానని నితిన్ చెప్పడంతో హాయిగా నవ్వేశారు. అమ్మాయిల వెంటపడి జేబులు గుల్లచేసుకున్నానని నాగ్ సరదాగా వ్యాఖ్యానించారు.