: తెలంగాణలో రెండు లేన్ల రోడ్ల నిర్మాణానికి జీవో జారీ
తెలంగాణలోని 149 మండల కేంద్రాల నుంచి ఆయా జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రెండు లేన్ల రోడ్డు నిర్మాణానికి 2,585 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని జీవోలో పేర్కొంది. నియోజకవర్గాల్లోని రోడ్లను కూడా రెండు వరుసల రోడ్లుగా మారుస్తూ జీవో జారీ అయింది. ఇందుకు 3,704 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు జీవోలో వెల్లడించింది. నియోజకవర్గాల్లోని 2,720 కిలోమీటర్ల మేర రోడ్డును రెండు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. రోడ్లతో పాటు వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం 1,974 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.