: కోఠిలో టెన్షన్...బాంబ్ స్క్వాడ్ తనిఖీలు


హైదరాబాదులోని కోఠిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కోఠిలోని వైద్య కళాశాల వద్ద అనుమానాస్పదంగా బ్యాగ్, సైకిల్ ను స్థానికులు గుర్తించారు. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన పోలీసులు, బ్యాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు సంచిలో ఏమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News