: ప్రజాప్రతినిధి ద్వారా లొంగిపోయిన అటెండర్ రమేష్


వరంగల్ జిల్లా భూపాలపల్లి, అజాంనగర్ లలోని ఏపీ జీవీబీ బ్యాంకు శాఖల్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసుల నిందితుడు అటెండర్ రమేష్, కాకారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా పోలీసులకు లొంగిపోయాడు. చోరీలో రమేష్ బ్యాంకు లాకర్ల నుంచి మొత్తం 36 కేజీల బంగారం, 21 లక్షల నగదు దోచుకుపోయాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం తీవ్రగాలింపు చేపట్టారు. విచారణ సందర్భంగా అతని భార్య ఇచ్చిన సమాచారంతో, ఈ నెల 22న కరీంనగర్ జిల్లా కాకారం మండలం అబంటిపల్లిలో చోరీకి గురైన 36 కేజీల బంగారం, 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 19 లక్షల రూపాయలు నిందితుడి వద్దే ఉన్నాయని గుర్తించిన పోలీసులు, అతనిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News