: తుళ్లూరు మండలంలో దారుణం... పత్తిచేలోకి లాక్కుపోయి అత్యాచారం
కొత్త చట్టాలు చేస్తున్నా, శిక్షలు పడుతున్నా కామాంధులకు మాత్రం బుద్ధి రావడంలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కాలువకు వెళ్లిన 12 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన డేవిడ్ అనే యువకుడు దగ్గర్లోని పత్తిచేలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో, నిందితుడు పరారయ్యాడు. దీంతో బాలిక తల్లి, తుళ్లూరు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, డేవిడ్ కోసం గాలింపు చేపట్టారు.