: డ్యూటీలో ఉండగా దీక్షలు తీసుకోవద్దు: తెలంగాణ పోలీసులకు ఆదేశం
విధి నిర్వహణలో ఉన్న పోలీసులు దీక్ష ధారణ చేయవద్దని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయ్యప్ప, భవానీ, హనుమాన్ దీక్షలు తీసుకోవాలనుకునే పోలీసులు సెలవు పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. యూనిఫాంపై మతపరమైన చిహ్నాలు ధరించవద్దని పోలీస్ మాన్యువల్ స్పష్టం చేస్తోందని అధికారులు తెలిపారు. విధులకు హాజరయ్యే పోలీసులు విధిగా యూనిఫాం ధరించాలని వారు తెలిపారు. ఈ ఆంక్షలపై తెలంగాణ హోం సెక్రటరీ నుంచి మినహాయింపు లభిస్తే తమకు అభ్యంతరం లేదని అధికారులు వివరించారు. గతంలో యూనిఫాంపై అయ్యప్ప మాలను సూచించే నల్ల కండువా వేసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో, తమకు మినహాయింపు లభిస్తుందని దీక్షదారులు ఆశిస్తున్నారు.