: ఐపీఎల్ సహచరుడి మృతితో షాక్ తిన్న సచిన్
ఫిలిప్ హ్యూస్ మరణం సచిన్ టెండూల్కర్ ను దిగ్భ్రమకు గురిచేసింది. మరణ వార్తపై స్పందిస్తూ, క్రికెట్ కు ఇది విషాదకరమైన రోజు అని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో హ్యూస్ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అతని కుటుంబానికి, అతని మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సచిన్ ట్వీట్ చేశాడు. అటు, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించారు. ఇలాంటి వార్తలు వినడాన్ని ఎవరూ ఇష్టపడరని అన్నారు. విషాదంలో మునిగిపోయిన హ్యూస్ కుటుంబానికి, ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక, యువరాజ్ సింగ్ క్రికెట్ కు చీకటి రోజని పేర్కొన్నాడు. బీసీసీఐ కూడా హ్యూస్ కుటుంబానికి సానుభూతి తెలిపింది.