: బీజేపీ ఎంపీ శ్రీరాములుపై సెర్చ్ వారెంట్
బళ్లారి లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత బి.శ్రీరాములుపై సెర్చ్ వారెంట్ జారీ అయింది. ఏప్రిల్ లో ఆయనపై నమోదైన ఛీటింగ్ కేసుకు సంబంధించి వారెంట్ జారీ చేస్తున్నట్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. కేసు విచారణకు వచ్చిన సమయంలో కోర్టుకు ఎంపీగానీ, ఆయన న్యాయవాది కానీ హాజరుకాకపోవడంపై ఈ వారెంట్ జారీ చేశారు. ఇదే కేసులో సెప్టెంబర్ లో కోర్టు రాములుపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని, లేదంటే, ఎంఎల్సీని చేస్తానంటూ శ్రీరాములు తన నుంచి డబ్బులు తీసుకున్నారంటూ బీఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు.