: రేవంత్ రెడ్డి అసహనం... హెడ్ ఫోన్ విసిరేసి పోడియంలోకి!
టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదేపదే కోరుతున్నా, స్పీకర్ మధుసూదనాచారి పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోతూ, హెడ్ ఫోన్ ను విసిరేసి పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆ వెంటనే లంచ్ బ్రేక్ కోసమంటూ సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో, రేవంత్ రెడ్డి కూడా భోజనం చేసేందుకు సహచరులతో కలసి బయటికి వెళ్ళారు.