: గ్రీన్ ల్యాండ్స్, శిల్పారామం మధ్య మెట్రో పనులకు హైకోర్టు అనుమతి


హైదరాబాదులోని గ్రీన్ ల్యాండ్స్ నుంచి శిల్పారామం మధ్య మెట్రో పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మార్గంలో పనులు నిర్వహించుకునేందుకు హైకోర్టు తాజాగా అనుమతించింది. గ్రీన్ ల్యాండ్స్ నుంచి శిల్పారామం మధ్య పనులకు అనుమతివ్వాలని కోరుతూ హైదరాబాదు మెట్రో రైలు సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో దీనిపై ఉన్న స్టేను ఎత్తివేసింది. గ్రీన్ ల్యాండ్స్ నుంచి శిల్పారామం మధ్య మెట్రో రైలు పనుల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరుగుతుందంటూ కృష్ణానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కు చెందిన పలు ప్రజాసంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి.

  • Loading...

More Telugu News