: నల్లధనం దాచామని 250 మంది ఒప్పుకున్నారు: అరుణ్ జైట్లీ
విదేశాల్లో బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నారని గుర్తించిన 427 మంది నల్లకుబేరుల్లో 250 మంది విదేశీ ఖాతాలు ఉన్నాయని అంగీకరించారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభకు తెలిపారు. నల్లధనాన్ని వెనక్కు తెచ్చే విషయంలో నేడు పార్లమెంటు ఉభయసభల్లో వాడీవేడిగా చర్చ జరిగింది. ఆ తరువాత అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. లెక్కలలోకి రాకుండా విదేశీ బ్యాంకుల్లో ఉన్న డబ్బును తిరిగి తెప్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. అయితే, జైట్లీ సమాధానం తమకు అసంతృప్తిని కలిగించిందని కాంగ్రెస్ తదితర విపక్షాలు వ్యాఖ్యానించాయి.