: జైలు శిక్షపై వీణామాలిక్ ఆశ్చర్యం


పాకిస్థాన్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ లో తీవ్రవాద వ్యతిరేక కోర్టు తనకు, తన భర్తకు విధించిన జైలు శిక్షపై నటి వీణామాలిక్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, న్యాయం కోసం పోరాడేందుకు ఆలోచన చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. "ఈ విషయం నాకు షాక్ కలిగించింది. అయినా, పాక్ ఉన్నత న్యాయస్ధానాలు, న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కోర్టు మిగతా కోర్టుల కంటే ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది" అని వీణా పేర్కొంది. ఓ టీవీ షోలో దైవ దూషణ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా వీణా, ఆమె భర్త బషీర్ లతో పాటు జియోటీవీ ఛానల్ అధిపతి మిర్ షకీల్-ఉర్-రహమాన్ లకు 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.13 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News