: జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి: మంత్రి కామినేని
ఏపీలో జూనియర్ డాక్టర్లు 48 గంటల్లోగా సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ విజ్ఞప్తిని ధిక్కరించి జూడాలు సమ్మె కొనసాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూడాల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పిన ఆయన, ప్రభుత్వ వైద్య సేవలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత జూడాలపై ఉందన్నారు. బాధ్యతను మరచి వ్యవహరించే జూడాలపై చర్యలకు ఏమాత్రం వెనుకాడబోమని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.