: బాబు బండారం బయటపడుతుందనే అసెంబ్లీలో గొడవ
చంద్రబాబు నాయుడు బండారం బయటపడుతుందనే తెలంగాణ అసెంబ్లీని టీడీపీ, బీజేపీలు అడ్డుకుంటున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. నేటి ఉదయం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా ప్రతిపక్షాలు కావాలనే ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చేసిన అక్రమాల గుట్టు బయట పడుతుందనే టీడీపీ సమయాన్ని వృథా చేస్తోందని, ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు బండారం బట్టబయలు అవుతుందన్నది వారి భయమని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.