: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... వాయిదా


తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొద్దిసేపటి క్రితం మొదలయ్యాయి. విపక్షాలిచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి, ప్రశ్నోత్తరాలను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాల మీద చర్చకు అనుమతించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. మెట్రో మార్గంలో జరిగిన మార్పులపై చర్చకు అనుమతించాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో, సభలో గందరగోళం నెలకొనడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News