: చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు


తెలుగు రాష్ట్రాలు గడచిన మూడు రోజులుగా చలి గుప్పిట్లో చిక్కుకుని వణుకుతున్నాయి. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. జంటనగరాల పరిధిలో గడచిన రాత్రి 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టును పొగమంచు కప్పేసింది. దీంతో, పలు విమానాల రాకపోకలకు నేడు కూడా అంతరాయం కలిగింది. విశాఖ ఏజెన్సీ చలిపులి ధాటికి వణికిపోతోంది. అక్కడి మోదమ్మ కొండలో 5, లంబసింగిలో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి,

  • Loading...

More Telugu News