: దమ్ముంటే రేవంత్ ని శాసనసభలో మాట్లాడనివ్వండి: ఎర్రబెల్లి
దమ్ముంటే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడనివ్వాలని టీఆర్ఎస్ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలు సవాలు విసిరారు. హైదరాబాదులో ఎర్రబెల్లి, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాట్లాడితే వారి బండారం బయటపడుతుందని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని వారు విమర్శించారు. రేవంత్ మాట్లాడితే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు బట్టబయలవుతాయనే భయంతో అధికారపక్షమే పోడియంలోకి వచ్చి ఆందోళన చేస్తోందని వారు ఎద్దేవా చేశారు.