: విశాఖ జిల్లాలో పెరుగుతున్న తుపాకీ కల్చర్...రౌడీ షీటర్ హల్ చల్


విశాఖ జిల్లాలో తుపాకీ సంస్కృతి పెరుగుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి జంక్షన్ లో ఓ రౌడీ షీటర్ తుపాకీతో హల్ చల్ చేశాడు. రౌడీషీటర్ రాజేష్ అనకాపల్లి జంక్షన్ లో నేటి సాయంత్రం తన ప్రత్యర్థి దాడి కృష్ణపై తుపాకీతో కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. తుపాకీ పేలకపోవడంతో దాడి కృష్ణ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో కృష్ణ వర్గీయులు అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగి, రాజేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News